Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

సీఎం రేవంత్ ను కలిసిన మాజీ మవోయిస్ట్ నేతలు

హైదరాబాద్: ఇటీవల తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. వీరిలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పుల్లూరి ప్రసాద్ అలియాస్ చంద్రన్న, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, పోతుల కల్పన అలియాస్ సుజాతక్క, నూనె నరసంహారెడ్డి అలియాస్ గంగన్న ఉన్నారు.

సీఎం రేవంత్ తో మావోయిస్టు మాజీ నేతలు భేటీ అయిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ బి. సుమతి తదితరులు కూడా ఉన్నారు.

Popular Articles