Top 5 This Week

Related Posts

‘వెంటిలేటర్’పై ప్రణబ్ ముఖర్జీ!

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘వెంటలేటర్’పై ఉన్నారు. తనకు కరోనా పాజిటివ్ గా తేలిందని, గడచిన వారం రోజులుగా తనను కలిసిన వారందరూ సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ ప్రణబ్ ముఖర్జీ నిన్న ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే ప్రణబ్ ముఖర్జీకి మెదడులోని క్లాట్ కు డాక్టర్లు శస్త్ర చికిత్స చేసినట్లు వార్తలు వస్తున్నాయి. శస్త్ర చికిత్స అనంతరం ప్రణబ్ ముఖర్జీ ఆర్మీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నట్లు జాతీయ మీడియా సంస్థల తాజా కథనం.

అయితే ప్రణబ్ ముఖర్జీ కీలక అవయవాలు నిలకడగా పనిచేస్తున్నాయని, వైద్య నిపుణులు ఆయన ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, పలువురు రాజకీయ నేతలు ప్రార్థనలు చేస్తున్నారు.

Popular Articles