Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

వావ్… చంద్రబాబు మనవడు… ఈ వయస్సుకే ఇంతయితే…!

ముందు దిగువన గల ఈ ట్విట్టర్ వీడియోను చూడండి. ఆ.. ఏముందీ వీడియోలో చంద్రబాబు జూమ్ ద్వారా ఏదో మాట్లాడుతున్నారు… అంతేగా… అనుకోకండి. అమరావతిపై తాజా పరిణామాల గురించి నిన్న సాయంత్రం దాదాపు గంటసేపు చంద్రబాబు మీడియాతో మాట్లాడినప్పటి సందర్భంలో 22 సెకన్ల నిడివి గల వీడియో బిట్ ఇది. ఏముంది…? ఇందులో ప్రత్యేక విశేషం… అనుకుంటున్నారా?

https://twitter.com/NLokeshTrends/status/1294306571980161025

అయితే వీడియోను మీరు సరిగ్గా చూడనట్టే లెక్క. మళ్లీ నిశితంగా పరిశీలించండి. ఔను… వీడియోలో చంద్రబాబు మనవడు దేవాన్ష్ కూడా ఉన్నాడు. చంద్రబాబు జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడుతుండగా దేవాన్ష్ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. చంద్రబాబు వెనుక గల షెల్ఫ్ లోని పుస్తకాన్ని తీసుకునేందుకు ఉద్యుక్తమయ్యాడు. కానీ తన తాత లైవ్ లో మాట్లాడుతున్నట్లు గమనించి వెంటనే పక్కకు జరిగాడు. కెమెరాలో చిక్కకూడదని భావిస్తూ, కిందకు వంగుతూ పుస్తకాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. కానీ కెమెరా తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా? దేవాన్ష్ ఇలా వ్యవహరించిన దృశ్యం కూడా రికార్డయ్యింది.

ఆయా వీడియోను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది… అబ్బో మా దేవాన్ష్ సూపర్…ఇంత చిన్న వయస్సులో ఎన్ని తెలివితేటలు… తాతకు తగ్గ మనవడు… అంటూ తెలుగు తమ్ముళ్లు తెగ మురిసిపోతున్నారట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదీ సంగతి.

Popular Articles