Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

తొలిరోజు ‘లాక్ డౌన్’ విశేషాలు

తెలంగాణాలో బుధవారం నుంచి అమలు చేస్తున్న లాక్ డౌన్ కఠినంగా అమలవుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. బుధవారం లాక్ డౌన్ అమలైన తీరు ఇలా ఉంది.

  • ఉదయం 6 నుంచి 10 వరకు తెరుచుకున్న అన్ని షాపులు
  • రోజువారీ నిత్యావసరాలు, ఇతర కొనుగోళ్లతో రద్దీ
  • ఆ 4 గంటలపాటే సేవలందించిన మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు
  • ఆ తర్వాత 20 గంటలపాటు కట్టుదిట్టంగా లాక్ డౌన్
  • యథావిధిగా వ్యవసాయ పనులు, ధాన్యం కొనుగోళ్లు
  • ప్రత్యేక పాసులతో విధులకు హాజరైన వైద్య సిబ్బంది
  • 33% సిబ్బందితో పనిచేసిన ప్రభుత్వ కార్యాలయాలు
  • గ్రామీణ ప్రాంతాల్లో యధావిధిగా ఉపాధి హామీ పనులు
  • తెరిచే ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లు, పెట్రోల్ బంకులు
  • వివిధ రంగాల వర్క్‌ ఫ్రమ్‌ హోం విధుల్లో వీలైన ఉద్యోగులు
  • ప్రభుత్వ, ప్రైవేట్‌ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పూర్తిగా రద్దు
  • ప్రజలు లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు సరిహద్దు దాటేందుకు నో ఛాన్స్
  • లాక్ డౌన్ తో మూసే ఉన్న అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాలు
  • బంద్ అయిన థియేటర్లు, పార్కులు, క్లబ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్స్
  • ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు, కఠినంగా లాక్ డౌన్ నిబంధనల అమలు

Popular Articles