Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

సీపీఐ నాయకుడి కాల్చివేత

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందూ నాయక్ దారుణ మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఉదయం మలక్ పేట శాలివాహన నగర్ పార్కులో మార్నింగ్ వాక్ కు వెళ్లిన చందూ నాయక్ పై గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఓ కారులో వచ్చిన దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపగా, చందూనాయక్ అక్కడిక్కడే మృతి చెందారు. తన భార్య,కుమార్తెతో కలిసి చందూనాయక్ మార్నింగ్ వాక్ చేస్తుండగా, పలువురు వాకర్స్ చూస్తుండగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. చందూ నాయక్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం నర్సాయపల్లిగా పోలీసులు చెప్పారు.

చందూనాయక్ హత్యకు రియల్ ఎస్టేట్ తగాదాలే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎల్ బీ నగర్ పరిధిలో 2022లో జరిగిన ఓ హత్య కేసులో చందూ నాయక్ నిందితునిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థంలో ఐదు తుపాకీ తూటాలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు పాల్పడిన వారికోసం ప్రత్యేక టీంలతో గాలిస్తున్నట్లు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ ప్రకటించారు.

చందూనాయక్ ను కాల్చి చంపిన స్థలంలో దృశ్యం
విలపిస్తున్న చందూనాయక్ కుటుంబ సభ్యులు, బంధువులు
సంఘటనా స్థలంలో తుపాకీ తూటా

Popular Articles