Top 5 This Week

Related Posts

ఘోర బస్సు ప్రమాదం, 20 మంది దుర్మరణం

కర్నూలు: కర్నూలు జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 20 మందికి పైగా దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెడుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి అగ్ని ప్రమాదానికి గురైంది. అగ్నిప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు పిల్లలు సహా మొత్తం 41 మంది వరకు ఉన్నట్లు తెలుస్తుండగా, 12 మంది వరకు స్వల్ప గాయాలతో బయటపడినట్లు, 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ నుంచి గత రాత్రి 10.30 గంటలకు బస్సు కర్నూలు నగర శివార్లలోని ఉలిందకొండ వద్దకు ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు రాగానే వెనుకవైపు నంచి వస్తున్న ఓ బైకు ఢీకొట్టింది. ఈ పరిణామాల్లో బైకు బస్సు కిందకు వెళ్లి డీజిల్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సును అంటుకుుని వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణీకులు ఏం జరిగిందోనని తేరుకునే లోపే అనేక మంది మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా కాలిపోయింది.

కాగా బస్సు ప్రమాద ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సీఎస్, డీజీపీతో మాట్లాడి తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Popular Articles