Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

పెళ్లాంతో కూసొని తాగాలె… మంచిగ ఎంజయ్ జెయ్యాలె… చెఫ్ సంజయ్ ‘సండే స్పెషల్’!

ఫేమస్ వంటగాడు.. సంజయ్ తెలుసుగా? అదేనండీ ఇంగ్లీషులో ఇటువంటి వంటగాడిని చెఫ్ అంటుంటారన్న మాట. రుచికరమైన వంటల్లో ఆరితేరిన ప్రముఖ వంటగాడిగా సంజయ్ కు పేరుంది లెండి. అనేక టీవీ ఛానళ్లలో మధ్యాహ్నం పూట తన వంటలను వివరిస్తూ నోరూరిస్తుంటాడు.

ఔను.. ఆ సంజయే… సహధర్మచారణి పక్కనే ఉండి మాంచి వంటకమేదో ప్రేక్షకులకు వివరించి మరీ చెబుతున్నాడు. పెళ్లాంతో కూసొని తాగాల్నని, మంచిగ ఎంజాయ్ జెయ్యాల్నని, బీరు సీసాను ఓపెన్ జేసి, గ్లాసుల్లో పోసి, ఛీర్స్ కొట్టి మరీ చెప్తున్నడు. వంటల గురించి చెబితే ఫరవాలేదు. కానీ తనదైన శైలిలో కొత్త తరహా వంటకమేదో వివరిస్తున్నాడు.

ఆసక్తికరమైన ఈ వంటకపు సారాంశాన్ని ఆద్యంతం అక్షర రూపంలో చెబితే బాగోదుగాని, దిగువన గల వీడియోలో తిలకించి మీరూ ఎంజాయ్ చేయండి. ‘సంజయ్ సండే స్పెషల్’గా సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది మరి!

Popular Articles