జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్), టీజీసీఏబీ పాలక వర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ తెలంగాణా ప్రభుత్వం గురువారం ఉత్తర్వు జారీ చేసింది. ఆయా సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం ఇప్పటికే పొడిగించగా, ఆ గడువు ఈనెల 14వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తెలంగాణా సహకార సంఘాల చట్టం 1964 ప్రకారం సెక్షన్ 32(7)(ఏ) కింద పాలక వర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వు జారీ చేసింది.
