Top 5 This Week

Related Posts

GHMC ఎన్నికలపై పేలుతున్న కార్టూన్లు

యావత్ తెలంగాణా రాష్ట్రమే కాదు, దేశ ప్రజలు సైతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పరిణామాలను అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారు. మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి అక్కడి ప్రజలు ‘చెక్’ పెట్టడమే ఇందుకు కారణం కావచ్చు. దుబ్బాక గెలుపు జోష్ తో బీజేపీ, అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా టీఆర్ఎస్ పార్టీలు జీహెచ్ఎంసీ ఎన్నికలను సవాల్ గా స్వీకరించినట్లు స్పష్టమవుతోంది కూడా.

బీజేపీకి చెందిన జాతీయ నేతలు హైదరాబాద్ లో మకాం వేశారంటే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రాధాన్యతను అవగతం చేసుకోవచ్చు. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యాన్ని ప్రామాణికంగా తీసుకుని కార్టూనిస్టు పైడి శ్రీనివాస్ గీస్తున్న వ్యంగ్య చిత్రాలు భలే ఆసక్తికరంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలను అందుకుంటున్న ఆయా కార్టూన్లలో కొన్ని మీ కోసం… దిగువన చూసేయండి సరదాగా…!

Popular Articles