Top 5 This Week

Related Posts

‘నామ’కు ఈడీ పిలుపు

టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వర్ రావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈనెల 25వ తేదీన హాజరు కావలసిందిగా ఈడీ పేర్కొంది. బ్యాంకు రుణాల నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎంపీ నామ నాగేశ్వర్ రావుతోపాటు కేసులో నిందితులందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది. నామ నాగేశ్వర్ రావు ఇంట్లోనేగాక మధుకాస్ సంస్థలకు చెందిన ఆఫీసుల్లో, సంస్థ గ్రూప్ డైరెక్టర్లకు చెందిన నివాసాల్లో ఈడీ అధికారులు ఇటీవల సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనెల 25న హాజరు కావాలంటూ నామ నాగేశ్వర్ రావు తదితరులకు ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం.

Popular Articles