Top 5 This Week

Related Posts

భారీ ఎన్కౌంటర్… ఇద్దరు ఎఎస్ఐలు, నక్సల్స్ మృతి

తెలంగాణా సరిహద్దుల్లో, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అడవుల్లో కొద్ది సేపటి క్రితం పోలీసులకు, మావోయిస్టు నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఎఎస్ఐలు మరణించగా, ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలం నుంచి భారీ సంఖ్యలో మావోలకు చెందిన తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అనేక మంది నక్సలైట్లు కూడా మరణించి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా గాయపడిన జవాన్లను హెలీకాప్టర్ ద్వారా గడ్చిరోలి ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ కు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Popular Articles