Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

దర్బా అడవుల్లో ఎన్కౌంటర్: మిలీషియా కమాండర్ మృతి

ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా దర్బా అడవుల్లో పోలీసులు, నక్సలైట్లు ముఖాముఖి తలపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన నక్సల్ ఒకరు మృతి చెందారు. ఇతన్ని మావోయిస్టు పార్టీ సామూహిక మిలీషియా కమాండర్ సంతోష్ గా పోలీసులు గుర్తించారు.

కుట్రూ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దర్బా అడవుల్లో ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ ఘటనను బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి రైఫిల్స్, నక్సల్ సామాగ్రిని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరణించిన నక్సల్ సంతోష్ అనేక నేర ఘటనల్లో పాల్గొన్నట్లు చెప్పారు. ఎఎస్ఐ, ఫారెస్ట్ రేంజర్ హత్యోదంతాలు కూడా ఇందులో ఉన్నాయన్నారు.

Popular Articles