Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఎన్కౌంటర్: ముగ్గురు నక్సల్స్ మృతి

ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లోని (ఏవోబీ) అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం… ఒడిషాలోని మల్కన్ గిరి జిల్లా తులసిపహాడ్ అటవీ ప్రాంతంలో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన జరిగిన ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా, భద్రతా బలగాలు తప్పించుకున్న మిగతా నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

ఫొటో: ప్రతీకాత్మక చిత్రం

Popular Articles