ఆంధ్రప్రదేశ్ లో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ సహా ముగ్గురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని సరిహద్దుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.
ఆయా మండలాల్లోని కొండమొదలు, కొయ్యలగూడెం, చింతకూలు అటవీ ప్రాంతంలో జరిగినట్లు పేర్కొంటున్న ఈ ఎన్కౌంటర్ లో గణేష్ తోపాటు ఇటీవల మరో ఎదురుకాల్పు ఘటనలో చనిపోయిన చలపతి భార్య అరుణ, ఏసీఎం సభ్యురాలు అంజు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి మూడు ఏకే-47 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
