Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

Breaking: అబూజ్ మడ్ అడవుల్లో ఎన్కౌంటర్!

అబూజ్ మడ్ అడవుల్లో మరోసారి పోలీసుల విజయం. ఛత్తీస్ గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లో గల అబూజ్ మడ్ అడవుల్లో మావోయిస్టు నక్సల్ కార్యకలాపాల గురించి కొత్తగా చర్చించేది ఏమీ లేదు. ఆ పార్టీ కార్యకలాపాలకు పెట్టని కోటగా అబూజ్ మడ్ ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. గతంలో ఓసారి అబూజ్ మడ్ అడవుల్లోకి చొచ్చుకువెళ్లి మావోయిస్టు నక్సల్స్ కు భారీ నష్టాన్ని కలిగించిన పోలీసులు రెండోసారి కూడా అదే కోటలోకి ప్రవేశించడం విశేషం. ఈసారి జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో అయిదుగురు నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేయడం మరో ప్రత్యేకత. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు రాత్రి పొద్దుపోయాక 10.30 గంటలకు సమాచారం అందడం గమనార్హం.

गडचिरोली : अबुजमाड जंगल परिसराचा भाग समजल्या जाणाऱ्या परिसरात गडचिरोली पोलीस दलाला अभूतपूर्व यश मिळालं असून, आज झालेल्या एका चकमकीदरम्यान पाच नक्षलवाद्यांना अटक करण्यात आली. या नक्षलवाद्यांमध्ये २ नक्षली कुटूल नक्षल दलमचे सदस्य, तर ३ जनमिलिशिया म्हणून कार्यरत आहेत. उपविभाग भामरागड हद्दीत येणाऱ्या उपपोलीस स्टेशन लाहेरीपासून अंदाजे ३५ किमी अंतरावर असलेल्या व छत्तीसगड राज्याला लागून असलेल्या मौजा पेरिमिलीभट्टी जंगल परिसरात गडचिरोली पोलीस दलातील सी-६० चे जवान नक्षलविरोधी अभियान राबवित असताना नक्षलवाद्यांनी पोलिसांना जीवे मारण्याच्या उद्देशाने पोलिसांच्या दिशेनं गोळीबार केला. स्वसंरक्षणार्थ व प्रत्युत्तरादाखल जवानांनी गोळीबार केला. यावेळी नक्षलवादी घनदाट जंगलाचा फायदा घेत पळून जाण्याचा प्रयत्न करू लागले. सी ६० कामांडोनी नक्षलवाद्यांचा शौर्यपूर्ण पाठलाग केला असता ५ जहाल नक्षलवाद्यांना पकडण्यात सी ६० जवानांना यश प्राप्त झाले.
अटक केलेल्या नक्षलवाद्यांमध्ये
१) रैणू सोनू वड्डे (वय २० वर्षे) रा. पदमकोट ता. कोहकामेटा जि. नारायणपूर. (छत्तीसगड)
२) बंडू चक्कु वड्डे (वय २५ वर्षे) रा. पदमकोट ता. कोहकामेटा जि. नारायणपूर.
३) सुखराम सोमा उसेंडी (वय ४० वर्षे) रा. उसेवाडा, ता. कोहकामेटा जि. नारायणपूर.
४) दोघे इरपा उसेंडी (वय ३० वर्षे), रा. उसेवाडा, ता. कोहकामेटा जि. नारायणपूर
५) केये सायबी वड्डे (वय ४० वर्षे) रा. पदमकोट ता. कोहकामेटा जि. नारायणपूर

వివరాల్లోకి వెడితే.. అబూజ్ మడ్ అడవుల్లోకి రెండోసారి విజయవంతంగా చొచ్చుకువెళ్లిన పోలీసులకు, అక్కడే గల మావోయిస్టు నక్సలైట్లకు మధ్య బుధవారం భీకర పోరు జరిగింది. భమ్రాగఢ్ సబ్ డివిజన్ పరిధిలోని లాహిరి పోలీస్ స్టేషన్ కు ఏడు కిలోమీటర్ల దూరంలో గల మోజా పెరిమిలి భట్టి అటవీ ప్రాంతంలో నక్సలైట్లకు, గడ్చిరోలి పోలీసు బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా కొంత ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తున్నప్పటికీ, అధికారికంగా సమాచారం ధృవపడలేదు. అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో కోబ్రా కమాండోలు నక్సలైట్లను వెంబడించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నక్సలైట్లలో ఇద్దరు కుతుల్ దళం సభ్యులు కాగా, మరో ముగ్గురు మిలీషియా సభ్యులుగా గుర్తించారు. రాను సోను వాడ్డే, బండు చాకు వడ్డే, సుఖ్రామ్  సోమ ఉసెండి,  ఇర్పా ఉసెండి, కాయే సైబీ వడ్డే అనే నక్సలైట్లను అదుపులోకి తీసుకున్నట్లు గడ్చిరోలి పోలీసులు వెల్లడించారు. వీరంతా నారాయణపూర్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందినవారిగా పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న తుపాకులను, ఇతర వస్తువులను దిగువన చూడవచ్చు.

Popular Articles