ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని మున్సిపల్ పాలక వర్గాలు ప్రమాణ స్వీకారం చేశాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సహా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లోని ఇల్లెందు మినహా మిగతా చోట్ల కార్పొరేటర్ల, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ముగిసింది. ఇదే దశలో ఆయా కేంద్రాల్లో మున్సిపల్ పాలకులుగా చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక ప్రక్రియ కూడా నిర్వహించారు. ఇవీ వివరాలు
- కొత్తగూడెం మేయర్ గా మూడ్ గణేష్ (సీపీఐ), డిప్యూటీ మేయర్ గా సిరిపురపు లలిత (కాంగ్రెస్) ఎన్నికయ్యారు.

- అశ్వారావుపేట మున్సిపల్ చైర్మెన్ గా జూపల్లి శశికళ, వైస్ చైర్మెన్ గా ఆమె భర్త జూపల్లి రమేష్ ఎన్నికయ్యారు.

- ఏదులాపురం మున్సిపల్ చైర్మెన్ గా పోకబత్తిని అనిత, వైస్ చైర్మెన్ గా తమ్మినేని నవీన్ ను ఎన్నుకున్నారు.

- సత్తుపల్లి మున్సిపల్ చైర్మెన్ గా రెహానా బేగం, వైస్ చైర్మెన్ గా బొంతు సుమలత ఎన్నికయ్యారు.

- కల్లూరు మున్సిపల్ చైర్మెన్ గా ధరావత్ మోహన్ నాయక్, వైస్ చైర్మెన్ గా శీలం కోటేశ్వరిని ఎన్నుకున్నారు.

- వైరా మున్సిపల్ చైర్మెన్ గా కాపా చంద్రకళ, వైస్ చైర్మెన్ గా కట్ల సంతోష్ లను ఎన్నుకున్నారు.

- మధిర మున్సిపల్ చైర్మెన్ గా సామినేని సుజాత, వైస్ చైర్మెన్ గా కోట ధనమూర్తి ఎన్నికయ్యారు.
- ఇల్లెందు పాలకవర్గం ఎన్నిక ఇంకా జరగలేదు. క్యాంపులో గల కౌన్సిలర్లు ఇంకా ఇల్లెందుకు చేరుకోకపోవడంతో ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

