Top 5 This Week

Related Posts

పాయె… దుబ్బాకలో ‘ఇజ్జత్’ పాయె! వీడియో చూడండి!

కొన్ని ఘటనలకు పెద్దగా రాతలు అక్కరలేదు. దృశ్యమే విషయాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో ఎవరి ‘ఇజ్జత్’ పోయినట్లు? ఇదీ తాజా సందేహం. విషయమేమిటంటే… దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు బంధువుల నివాసాల్లో పోలీసులు సోమవారం తనిఖీలకు వెళ్లారు. రఘునందన్ రావు మామ రాంగోపాల్ రావు, మరో బంధువు అంజన్ రావు ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.

ఇదే సందర్భంగా ఓ పోలీసాయన చేతిలో బ్యాగు పట్టుకుని కనిపించిన సీన్ తీవ్ర కలకలానికి దారి తీసింది. బీజేపీ కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. ఆ బ్యాగులో ఏముందంటూ బీజేపీ కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఒకటే తోపులాట. కొందరు కార్యకర్తలు పోలీసులను తోసుకుని మరీ ఆ బ్యాగులో ఏముందో తేల్చేశారా? కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు బ్యాగు నుంచి బయటపడ్డాయా? ఇదే నిజమైతే ఈ ఘటనలో మొత్తంగా ఎవరి ఇజ్జత్ పోయినట్లు?

అందుకే ఇక ఈ వార్తకు ఇంతకన్నా ఎక్కువ రాతలు రాస్తే బాగుండదు గాని, దిగువన గల వీడియోను చూడండి. పోలీసు తనిఖీల్లో ఏం జరిగిందో మీరే స్వయంగా చూసి నిర్ణయించండి. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ప్రత్యేక గమనిక: వీడియోను ప్రారంభం నుంచి గమనించవలెను.

https://youtu.be/Z4JmFUQ_oN8

Popular Articles