Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

‘పొలిటికల్’ ఆటాడుకుందామా…!!

చిత్రంగా అందరూ
ఎన్నికల ఉత్కంఠ తీర్పును
ఐపీఎల్ 20:20 క్రికెట్‌
‘ఆట’తో
పోల్చుతున్నారు…!

అంటే…
ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలుస్తారనికావచ్చేమో…!!

అయితే…
ఈ ఆటలు మనకు ఏం నేర్పుతున్నాయి…!?

గట్టి కెప్టెన్‌:
ఓపెనింగ్‌ జోడీ:
బ్యాటింగ్:
బౌలింగ్:
ఆల్‌రౌండర్లు:
పించ్‌హిట్టర్లు
మాంచి వికెట్ కీపర్ అవసరమనేనా.!?

ఇవేకాదు అన్ని హంగులున్న
బలమైన ఫ్రాంచైజీ:
అవసరమున్నా లేకున్నా
స్లెడ్జింగ్‌:
అవసరం మేరకు ముఖ్యంగా మ్యాచ్‌ ఫిక్సింగులు చేయగలిగితేనే…!

అన్నింటికంటే పిచ్‌ అనుకూలిస్తేనేగదా!!

ఎవరికైనా…!?
విజయాలు లభిస్తాయేమో…!!

అప్పుడే మ్యాచ్‌లు మజాగా
ఉంటాయి కావచ్చేమో…!?

కాకుంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లూ
మొన్న 20:20లూ
గతంలో వన్డేలూ
అంతకు ముందు టెస్ట్ మ్యాచ్‌లూ…!!

ఒక్కోదాంట్లో ఒక్కో జట్టూ ఎక్సపర్ట్‌లేమో…!?

ఇప్పుడు అండ్లదుర్గం ఇండ్లదుర్గం
లెక్క
అన్నీ ఐపీఎల్ జట్లేనాయే..!

ఇకపై రానున్నరోజుల్లో
10:10 మ్యాచ్‌లు ఆడుతారేమో…!!

ఇక్కడ
గట్టి ఆటగాళ్లను ‘కొనుక్కొ’గలిగే
దమ్మున్న యజమానులే
మరీమరీ ముఖ్యమనుకుంటా…!?

ఇక ఈ ఆటలో
ఒక్క రోజు మినహా
మనము మాత్రం ప్రేక్షకులుగానే మిగులుతున్నామా…!?

అంపైర్‌ల ఫలితాల
అధికార ప్రకటనలూ
రివ్యూల మధ్య
వీరతిలకాలు దిద్దుకొనీ
జేజేలతో జెండాలు మోసీ
చప్పట్లుగొట్టీ
ఈలలేసే పనిలో మనమంతా
జిందాబాద్‌ల లొల్లిలో
పూర్తిగా నిమగ్నమైదామా…!

మరో పొట్టి సీరిస్‌ వచ్చే
వరకు మనం
పిల్లీవచ్చే ఎలుకా భద్రం
దాగుడు మూతల ఆటాడుకుందామా!!

✍️ రవి ® సంగోజు

Popular Articles