Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

దేవుని దయవల్లే కరోనా!

తనకు కరోనా సోకడం కూడా దేవుని దయగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణిస్తున్నారు. ఫలితంగానే ప్రజలకు కరోనాపై అందించాల్సిన చికిత్స గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లు ఆయన చెబుతున్నారు. కరోనా బారిన పడిన ట్రంప్ సైనిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుని రెండు రోజుల క్రితమే వైట్ హౌజ్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.

దేవుని దయవల్లే తనకు కరోనా సోకినట్లు భావిస్తున్నానని, కరోనాకు డాక్టర్లు అందిస్తున్న చికిత్స అత్యుత్తమైనదనే విషయాన్ని తాను తెలుసుకోగలిగానని చెప్పారు. అమెరికా అధ్యక్షునిగా తాను కరోనాకు ఎటువంటి చికిత్సను పొందానో, దేశ ప్రజలకు కూడా ఇదే తరహా చికిత్సను ఉచితంగా అందిస్తానని ప్రకటించారు. ఇదంతా దేవుని దయగానే ట్రంప్ పేర్కొంటూ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇదే సందర్భంగా చైనాను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనా భారీ మూల్యం చెల్లించకతప్పదన్నారు. ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోను దిగువన చూడవచ్చు.

Popular Articles