ఖమ్మం నగరంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు వందల అడుగుల మువ్వన్నెల జెండా కనువిందు చేసింది. ఖమ్మంలోని అభినవ్ హైస్కూల్ కు చెందిన 600 మంది విద్యార్థులు ఈ భారీ జెండాను నగరంలో ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. త్రీటౌన్ లోని పంపింగ్ వెల్ రోడ్డులో గల తమ స్కూల్ నుంచి 200 అడుగుల జెండాతో ప్రదర్శనగా బయలుదేరి గాంధీ చౌక్ లోని మహత్మాగాంధీ విగ్రహం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో అంబేద్కర్, చాచా నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో అభినవ్ హైస్కూల్ కరస్పాండెంట్ పారుపల్లి వెంకటరమణ, డైరెక్టర్ అరుణ కుమారిలు మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థుల్లో దేశభక్తిని, స్వాతంత్య్ర సమరయోధుల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు ఈ ర్యాలీ దోహదపడుతుందని చెప్పారు.
