Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఎప్పుడంటే…?

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభించాలని తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభమైన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ను లాంచ్ చేస్తారని సీఎం తెలిపారు. ప్రగతిభవన్ లో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నదన్నారు. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. ధరణి ద్వారా వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా ఉందని, ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించిందన్నారు. మరో మూడు నాలుగు రోజులలో నూటికి నూరుశాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నట్లు చెప్పారు. సమస్యలు చక్కబడిన తర్వాతే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నామని, అందుకే కొన్ని రోజులు వేచి చూశామన్నారు.

Popular Articles