Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

కానిస్టేబుల్ హత్యపై డీజీపీ సీరియస్

హైదరాబాద్: నిజామాబాద్ లో నిన్న జరిగిన సీసీఎస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యోదంతంపై తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన నేరస్థుడు షేక్ రియాద్ ను పట్టుకునేందుకు స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు. అంతేగాక ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని మల్టీ జోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను పరామర్శించి, అతని కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని ఐజీకి డీజీపీ ఆదేశాలిచ్చారు.

వాహనాల దొంగతనాలకు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న షేక్ రియాద్ ను అరెస్ట్ చేసి బైకుపై తీసుకువస్తున్న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను అతను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఘటనను అడ్డుకోబోయిన ప్రమోద్ మేనల్లుడిని, సీసీఎస్ ఎస్ఐ విఠల్ ను కూడా రియాద్ కత్తితో తీవ్రంగా గాయపర్చాడు. నిజామాబాద్ పట్టణంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనపై డీజీపీ తీవ్రంగా స్పందించారు. కానిస్టేబుల్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. హత్యోదంతపై దర్యాప్తును వేగవంతం చేయాలని, నిందితున్ని వెంటనే పట్టుకోవాలని ఆయన ఆదేశించారు.

 

Popular Articles