Top 5 This Week

Related Posts

కరోనాకు డిప్యూటీ కలెక్టర్ బలి

రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిని కరోనా బలి తీసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లా చందన్ నగర్ డిప్యూటీ కలెక్టర్ దేబ్ దత్తా రాయ్ కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. కరోనా లక్షణాల కారణంగా డాక్టర్ల సలహా మేరకు ఈ నెల మొదట వారంలో ఆమె హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఫలితంగా ఇంటికే పరిమితమైన ఆమెకు శ్వాస సంబంధిత సమస్య ఏర్పడడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తుండగానే ఆమె ప్రాణాలు కోల్పోయారు. డిప్యూటీ కలెక్టర్ దేబ్ దత్తా రాయ్ మరణంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు.

Popular Articles