రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోర్ ప్రచారంపై తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక సిబిల్ స్కోర్ ఆధారంగా జరుగుతుందని చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఈ పథకంపై డిప్యూటీ సీఎం ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

- రాష్ట్రంలో నిరుద్యోగులకు వరంగా రాజీవ్ యువ వికాసం..
- ఈనెల 15నాటికి జిల్లా సెలక్షన్ కమిటీకి , 28 నాటికి శాంక్షన్ ప్రక్రియ పూర్తి చేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి నియోజకవర్గ వల్ల వారీగా శాంక్షన్ లెటర్ల పంపిణీ.
- ప్రభుత్వపరంగా 57 వేల ఉద్యోగాలు ఇచ్చాము, జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటిస్తాం. అయినా ఉద్యోగ అవకాశాలు రాని నిరుద్యోగుల కోసమే దేశంలో ఎక్కడ లేని విధంగా యువత స్వయం శక్తితో ఎదిగేలా రాజీవ్ యువ వికాసం పథకం.
- సిబిల్ స్కోర్ సామాజిక మాధ్యమాల అవగాహన లేని ప్రచారం.
- గత నాలుగేళ్లుగా ఎస్సీ, ఇతర కార్పొరేషన్ల లోన్లు తీసుకునే వారికి కాకుండా కొత్తవారికి రుణాలు ఇవ్వాలనేది ప్రభుత్వ ధ్యేయం.
- ఇల్లందు, మహబూబాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధుల వినతుల మేరకు బయ్యారం ప్రాజెక్టు తులారం ప్రాజెక్టుపై సర్వే చేసి ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చేలా చిత్తశుద్ధితో చర్యలు.
- మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఉద్యోగాలు కానీ స్వయం ఉపాధి పొందేలా కానీ ఎటువంటి పథకాలు అమలు చేయలేదు.

