Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

బడిపిల్లలతో డిప్యూటీ సీఎం సంభాషణ

బడి పిల్లలు.. తెలంగాణా డిప్యూటీ సీఎంల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ జరిగింది. భద్రాచల శ్రీ సీతారామస్వామి కళ్యాణానికి హాజరై తిరుగు ప్రయాణంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం సాయంత్రం వైరా మండల కేంద్రంలోని మహిళా రెసిడెన్షియల్ పాఠశాలకు ఆకస్మికంగా వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థినిలను ఒక్కొక్కరుగా పిలిచి వారు భవిష్యత్తులో ఏ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నారు.. వారు చదువుతున్న తరగతేమిటి? తల్లిదండ్రుల వివరాలను, వారి ఆర్థిక స్థితిగతుల గురించి భట్టి అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, విద్యార్థినుల మధ్య జరిగిన సంభాషణ తీరు ఇలా ఉంది.

నా పేరు ప్రణవి, నేను ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్లో సౌకర్యాలు అన్ని బాగున్నాయి, భోజనం బాగుంది. ఇటీవల ఏకతా భారత్, శ్రేష్టభారత్ కార్యక్రమం నిర్వహించాము.
డిప్యూటీ సీఎం: ఏం అవుదాం అనుకుంటున్నావ్?
ప్రణవి: కలెక్టర్
డిప్యూటీ సీఎం: ఎందుకు
ప్రణవి: అందరికీ సహాయం చేసే అవకాశం ఉంటుందని..

ఇక్కడ టీచింగ్, ఫుడ్ బాగుంది, సంతోషంగా ఉంది అని ఎనిమిదో తరగతికి చెందిన దివ్య ఈ సందర్భంగా వివరించారు.
డిప్యూటీ సీఎం: పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావ్?
దివ్య: డాక్టర్
డిప్యూటీ సీఎం: ఎందుకు
దివ్య: పేదలందరికీ ఉచితంగా వైద్య సహాయం చేయాలని

ఇక్కడ వాటర్ , ఫుడ్డు, టీచింగ్ అన్ని బాగుంటాయి. హౌస్ టీచర్ విజిత బాగా చూసుకుంటున్నారు అని 8వ తరగతి చెందిన ప్రవళిక వివరించారు.
డిప్యూటీ సీఎం: పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావ్
ప్రవళిక: డాక్టర్
డిప్యూటీ సీఎం: ఎందుకు
పేదవారికి సాయం చేసే అవకాశం ఉంటుందని

నా పేరు జ్యోత్స్న , ఏడవ తరగతి చదువుతున్నాను.
మా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ బాగున్నాయి. ఎస్సే రైటింగ్ లో పాల్గొన్నాను. మా స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీష్ స్పెషల్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.
డిప్యూటీ సీఎం: పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావ్
జ్యోత్స్న: పోలీస్ ఎస్ఐ
డిప్యూటీ సీఎం: ఎందుకు
జ్యోత్స్న: సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను.

విద్యార్థులతో సంభాషిస్తూ భోజనం చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి

అనంతరం విద్యార్థినిలతో పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ తర్వాత. డిన్నర్ రెడీగా ఉందా? అంతా కలిసి భోజనం చేద్దాం, పదండి అంటూ పిల్లలను వెంటపెట్టుకొని డిప్యూటీ సీఎం భోజనం చేశారు. మెనూ పాటిస్తున్నారా? భోజనాల్లో నాణ్యత ఎలా ఉంటుంది. ఈరోజు మెనూ ఏమిటి? మీకు తెలుసా? మెనూ పాటిస్తున్నారా అంటూ విద్యార్థినీలను ప్రశ్నించారు. భోజనం నాణ్యత బాగుంటుంది, మెనూ పాటిస్తున్నారంటూ విద్యార్థిని సమాధానం ఇచ్చారు. మెనూ ఫ్లెక్సీ ఎక్కడ పెట్టారు అంటూ ఆరా తీసి, ఫ్లెక్సీ దగ్గరకు వెళ్లి మెనూ చార్ట్ ను పరిశీలించారు. వసతులు, ఇబ్బందుల గురించి టీచింగ్ స్టాఫ్ ను అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది స్టాఫ్ ఉండాలి? ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Popular Articles