Top 5 This Week

Related Posts

చెన్నయ్ లో కేటీఆర్ పై భట్టి కీలక వ్యాఖ్యలు

చెన్నయ్ కేంద్రంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ మీడియా సంస్థ న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ చెన్నయ్ లో నిర్వహించిన ‘థింక్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్’ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా మీడియా సంస్థకు చెందిన మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భట్టి కేటీఆర్ పై నమోదైన ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంపై స్పందించారు.

‘మీరు మంచి ప్రతిపక్షం గురించి మాట్లాడుతున్నారు.. మీ ప్రభుత్వం ఈ మధ్యనే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కదా? ఇంతకీ అసలేం జరిగింది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో?’ అని మహిళా జర్నలిస్టు డిప్యూటీ సీఎంను ప్రశ్నించారు. ఇందుకు డిప్యూటీ సీఎం స్పందిస్తూ, అందులో వివాదాస్పదమైన అంశమేముంది? అని అడిగారు.

ఫార్ములా ఈ రేసు వ్యవహారం పరిపాలనాపరంగా జరుగుతున్న అంశమని, ప్రజాధనం దుర్వినియోగమైనట్లు వచ్చిన అభియోగంపై విచారణ జరుగుతోందన్నారు. ఈ అంశంతో సంబంధమున్నవారు ఎవరైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో సంబంధిత వ్యవస్థల్లో తమ వాదనలను వినిపించుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు భట్టి స్పష్టం చేశారు.

Popular Articles