Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

వ్యాపారమే కాదు.. సేవా మార్గంలోనూ వీవీసీ

తమ సంస్థలు వ్యాపారాన్ని నిర్వహించడమే కాదు, సేవా మార్గంలోనూ పయనిస్తున్నాయని వీవీసీ గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వీవీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ అంశంలో తమ స్ఫూర్తి ప్రదాత, వేలాది మంది ఉద్యోగుల ఉపాధికి బీజం వేసిన వీవీసీ మోటార్స్ సంస్థల వ్యవస్థాపకుడు వంకాయలపాటి వీరయ్య చౌదరి చూపిన సేవా మార్గాన్నే తమ సంస్థలు అనుసరిస్తున్నాయని ఆయన అన్నారు. వంకాయలపాటి వీరయ్య చౌదరి 26వ వర్థంతి కార్యక్రమాలను ఖమ్మం నగరంలోని ఆయన ఘాట్ వద్ద ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వీవీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, వీరయ్య చౌదరి చూపిన మార్గంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీవీసీ సంస్థ నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిందని, నిరుద్యోగులు వీవీసీ షోరూంలకు వెళ్లి వివరాలు ఇస్తే ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అదేవిధంగా వీవీసీ సంస్థల ఆధ్వర్యంలో అంబులెన్సులను, పార్టీవ దేహాల తరలింపు వాహనాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అందించినట్లు రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.

ప్రారంభించిన చలివేంద్రంలో మంచినీరు తాగుతున్న వీవీసీ సంస్థల ఎండీ వీవీ రాజేంద్ర ప్రసాద్

వీరయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. బోనకల్ రోడ్డులోని శ్రీ దుర్గాభవాని ఆశ్రమంలో వృద్దులకు నూతన వస్త్రాలను, నిత్యావసర సరుకులను అందించారు. అంతేగాక ప్రత్యేకంగా భోజనాలు తయారు చేయించి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా ఆశ్రమంలోని వృద్దులకు వడ్డించారు. కార్యక్రమంలో వీవీసీ సంస్థల చైర్మెన్ వంకాయలపాటి ద్రౌపతి, డైరెక్టర్లు వీరేన్ చౌదరి, విక్రమాదిత్య చౌదరి, ఉద్యోగులు పాల్గొన్నారు.

Popular Articles