Top 5 This Week

Related Posts

ఆటోలో డెడ్ బాడీలు: హైదరాబాద్ లో కలకలం

హైదరాబాద్: ఓ హోటల్ ఎదురుగా నిలిపిన ఆటోలో రెండు మృతదేహాలు కనిపించిన ఘటన హైదరాబాద్ మహానగరంలో కలకలం రేపింది. చాంద్రాయణగుట్టలోని రోమన్ హోటల్ ఎదురుగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆటోలో విగత జీవులుగా పడి ఉన్న ఇద్దరు వ్యక్తులను జహంగీర్, ఇర్ఫాన్ లు గా గుర్తించారు. ఇద్దరూ పాతికేళ్ల వయస్సులోపే ఉండడం గమనార్హం.

ఈ ఇద్దరు యువకుల మృతిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. స్టెరాయిడ్స్‌ ఓవర్‌ డోస్‌ తీసుకోవడంతోనే మృతి చెందారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థంలో మూడు సిరంజీలు కూడా లభ్యమయ్యాయని తెలుస్తోంది. విచారణలో భాగంగా పోలీసులు ఘటనా స్థలిలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Popular Articles