సీపీఐ ఖమ్మం జిల్లా నూతన కార్యదర్శిగా దండి సురేష్ ఎన్నికయ్యారు. అదేవిధంగా జిల్లా సహాయ కార్యదర్శిగా జమ్ముల జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. రెండు రోజులపాటు మధిరలో జరిగిన పార్టీ 23వ మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి మహాసభలలో 91 మందితో కౌన్సిల్ ను, 29 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్ ను ఎన్నికున్నారు.
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురానికి చెందిన సురేష్ విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ లో పనిచేశారు. ఆ తర్వాత ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో జన్మించారు. విద్యార్థి యువజన ఉద్యమాలలో పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంలో సుదీర్ఘకాలం జిల్లా, రాష్ట్ర బాధ్యతలను నిర్వర్తించారు ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పనిచేస్తున్నారు, వీరిద్దరు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు పార్టీ వెల్లడించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు, నాయకులు భాగం హేమంతరావు మహమ్మద్ మౌలానా తదితరులు నూతన నాయకత్వాన్ని అభినందించారు.
