Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

BIG BREAKING: కేబినెట్ లోకి ‘దానం’ ఖరారు!

తెలంగాణా రాజకీయాల్లో తాజా వార్త ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలోకి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను తీసుకోనున్నట్లు తాజా సమాచారం. తెలంగాణాలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే వార్తల నేపథ్యంలో దానం నాగేందర్ కు మంత్రి పదవి ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ దానం నాగేందర్ ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు మార్గం సుగమమైనట్లు ఆ వర్గాలు తెలిపాయి. తాజాగా ‘రాసలీలల’ వివాదంలో ఓ మంత్రి ఇరుక్కున్న నేపథ్యంలో ఆయనను తొలగిస్తారని భావిస్తున్నారు. అదే సామాజికవర్గానికి చెందిన దానం నాగేందర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా సామాజిక సమతుల్యతకు భంగం కలగకుండా వ్యవహరించినట్లవుతుందని అంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లబ్ధిపొందే వ్యూహంలో భాగంగానే దానం నాగేందర్ పేరు దాదాపు ఖరారైందని విశ్వసనీయ వర్గాల కథనం. ఓ మంత్రి రాసలీలల వివాదం కారణంగా జరిగిన నష్టాన్ని లాభంగా మార్చుకునే ఎత్తుగడలోనే దానం నాగేందర్ కు మంత్రి పదవి క్లియర్ అయినట్లుగా అంచనా వేస్తున్నారు.

రానున్న కొద్దిరోజుల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని చెబుతున్నారు. మొత్తంగా ‘దానం’ నాగేందర్ కు మంత్రి పదవి దాదాపు ఖరారైందనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Popular Articles