Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

‘అన్వేష్’కు తెలంగాణా పోలీసుల చెక్!

ప్రపంచ యాత్రికునిగా యూ ట్యూబ్ వీడియోలతో ప్రముఖుడైన అన్వేష్ కు తెలంగాణా పోలీసులు చెక్ పెట్టారు. ఈమేరకు అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణా రాష్ట్ర డీజీపీ జితేందర్, ఐఏఎస్ అధికారులు శాంతి కుమారి, వికాస్ రాజ్, దాన కిషోర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదతరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ల ప్రచారం పేరుతో రూ. 300 కోట్లు కొట్టేశారంటూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు. దీంతో ఆయా అంశంలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రపంచ యాత్రికునిగా యూ ట్యూబ్ వీడియోలతో ప్రసిద్ధిగాంచిన అన్వేష్ ఇటీవల బెట్టింగ్ యాప్ ల కోసం ప్రముఖులు ప్రచారం చేశారంటూ కూడా భిన్న కోణాల్లో కొన్ని వీడియోలు చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Popular Articles