Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

తెలుగు రాష్ట్రాల్లో రెండు కరోనా కేసులు నమోదు!

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్కటి చొప్పున శుక్రవారం కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో ఓ డాక్టర్ క కరోనా సోకింది. నాలుగు రోజులుగా ఆయన జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్నారు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన లేకపోవడం వంటి లక్షణాలు ఉండడంతో అన్నిరకాల పరీక్షలు చేయించగా, కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. అదేవిధంగా ఏపీలోని విశాఖలో మరో కరోనా కేసు నమోదైంది. రెండు రాష్ట్రాల్లో నమోదైన రెండు కేసులను వైద్యాధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కోరారు.

Popular Articles