Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

దగ్గు మందు తాగి 13 మంది పిల్లలు మృతి, డాక్టర్ అరెస్ట్

విషపూరిత సిరప్ ను సూచించి 13 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడానికి కారకుడనే అభియోగంపై మధ్యప్రదేశ్ పోలీసులు అదివారం తెల్లవారుజామున ఓ డాక్టర్ ను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో దగ్గు మందును తీసుకున్న పదమూడు మంది చిన్నారులు ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఈ దగ్గు మందును సూచించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న డాక్టర్ ప్రవీణ్ సోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత చిన్నారుల్లో అనేక మందికి డాక్టర్ ప్రవీణ్ సోని దగ్గుమందును సూచించారని తమ దర్యాప్తుల్లో తేలినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు వెల్లించారు.

ఇదే దశలో ఈ సిరప్ ను తయారు చేస్తున్న తమిళనాడులోని కాంచీపురానిక చెందిన స్రేసన్ ఫార్మా యూనిట్ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కంపెనీ తయారు చేసిన దగ్గుమందును చెక్ చేయగా, అందులో 48.6 శాతం డైఇథలిన్ గ్లైకాల్ (DEG) ఉన్నట్లు తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. అత్యంత విషపూరితమైన ఈ మందును తయారు చేసిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగనే FDAకు ప్రభుత్వం లేఖ రాసింది. కాగా తమిళనాడు, కేరళ, తెలంగాణాలో ఈ దగ్గుమందు వాడకాన్ని నిషేధిస్తూ హెచ్చరికలు జారీ అయ్యాయి.

Popular Articles