Top 5 This Week

Related Posts

నిగ్గదీసి అడిగెయ్… ఇంకా కడిగెయ్… ఈ సిగ్గులేని మీడియాను…!

ఈ వీడియోలో గల యువకుడు దుబాయ్ నుంచి వచ్చాడు. అదే అతను చేసిన అపరాధమా? ఘోర తప్పిదమా? దగ్గు వచ్చిందని దవాఖాను వెళ్లిన పాపానికి మీడియా ‘కరోనా’ వైరస్ అంటగడుతుందా? పారిపోయాడని టాం టాం చేస్తారా? విషయం పూర్తిగా కనుక్కోకుండానే ఫొటోలు, వీడియోలు తీసి టెర్రరైజ్ చేస్తారా? ఇది మీడియా విపరీత ధోరణి కాదా? ప్రజలను భయాందోళనకు గురిచేసే అంశాలపై సంయమనం పాటించాలని అధికారులు, పాలకులు, ఎవరు చెప్పినా మీడియా వినిపించుకోదా? తన ధోరణిని మార్చుకోదా? ఈ యువకుడు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు? అనివార్యంగా ఇప్పుడు అతను ‘విధి’ వంచితుడు కావలసిందేనా? ఈ యువకుని ప్రశ్నలకు సమాధానమేది? ఎవరు చెప్పాలి? దగ్గు వచ్చిందని ఆసుపత్రికి వెళ్లిన తనపై పుకార్లు ఎలా పుట్టించారనే అంశంపై జనగామకు చెందిన ఈ యువకుడి ఆవేదన దిగువన గల వీడియోలో వినండి.

Popular Articles