Top 5 This Week

Related Posts

హోం మంత్రికి కరోనా!

తెలంగాణా రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీకి కరోనా సోకింది. వైద్య పరీక్షల అనంతరం హోం మంత్రికి కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు కొద్దిసేపటి క్రితం నివేదిక వచ్చింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో గల హో మంత్రికి ఆస్తమా కూడా ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా కుటుంబ సభ్యులు ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చారు. మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆయనకు వైరస్ సోకినట్లు సోమవారం వెల్లడైంది. కాగా అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కరోనా బారిన పడగా, హోం మంత్రికి కరోనా సోకిన ఘటన టీఆర్ఎస్ పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

Popular Articles