Top 5 This Week

Related Posts

మంత్రి ఈటెల OSDకి కరోనా!

తెలంగాణా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) విధులు నిర్వహిస్తున్న అధికారికి కరోనా సోకినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆయన కరోనా బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి. గడచిన రెండు రోజులుగా ఓఎస్డీ మంత్రి ఈటెల వెంటే పలు కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. ఇదే దశలో సీఎం కేసీఆర్ కరోనాపై నేడు నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ మంత్రి ఈటెల పాల్గొన్నారు.

Popular Articles