Top 5 This Week

Related Posts

కడప ఎంపీకి కరోనా

ఆంధ్రప్రదేశ్ లోని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 1, 2 తేదీల్లో సీఎం జగన్ కడపలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులకు, జర్నలిస్టులకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా ఇదే సమయంలో కరోనా టెస్టు చేయగా ఆయనకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో అవినాష్ రెడ్డి వెంటనే హోం ఐసొలేషన్ లోకి వెళ్లారు.

Popular Articles