Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

మంత్రి ‘పువ్వాడ’కు కరోనా

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మంత్రి అజయ్ స్వయంగా వెల్లడించారు. తన ట్విట్టర్ ఖాతాలో, అధికారిక వాట్సప్ గ్రూపులో తనకు కరోనా సోకిందనే విషయాన్ని వెల్లడిస్తూ అజయ్ చేసిన పోస్టులను దిగువన చూడవచ్చు.

నిన్న చేసిన RTPCR పరీక్షల్లో COVID పాజిటివ్ అని తేలింది. నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నన్ను కలిసిన వారు, నాతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు దయచేసి COVID పరీక్ష చేసుకోవాలని మనవి. అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ నందు హోం ఐసోలాషన్ లో ఉన్నారు. మీ ప్రేమే నాకు అసలైన వైధ్యం. దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, నన్ను కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నా హెల్త్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మళ్ళీ యధావిధిగా మీ మధ్యకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను.

మీ
పువ్వాడ అజయ్ కుమార్..

Popular Articles