Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్

పవర్ స్టార్, జనసేన అధినేత కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగినట్లు జనసేన పార్టీ స్వయంగా ప్రకటించింది. ఈనెల మూడో తేదీన తిరుపతిలో నిర్వహించిన పాదయాత్ర వంటి కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్ వచ్చిన తర్వాత పవన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ గా తేలింది. అయినప్పటికీ వైద్యుల సలహా మేరకు పవన్ తన ఫాంహౌజ్ లో క్వారంటైన్ కు వెళ్లారు. ఆ తర్వత స్వల్పంగా జ్వరం, ఒంటినొప్పులు ఉండడంతో తాజాగా మరోసారి కరోనా టెస్టు చేయగా పాజిటివ్ గా తేలింది. ఖమ్మానికి చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ తంగెళ్ల సుమన్ పవన్ కళ్యాణ్ కు చికిత్స ప్రారంభించారు. ఇందుకు సంబంధించి జనసేన పూర్తి వివరాలతో విడుదల చేసిన ప్రకటనను దిగువన చూడవచ్చు.

Popular Articles