Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

నక్సల్స్ ఘాతుకం… కాంట్రాక్టర్ దారుణ హత్య

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టు నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్ ను దారుణంగా హత్య చేసిన నక్సల్స్ అదే సమయంలో అక్కడే గల విలువైన వాహనాలను దహనం చేశారు.

సుక్మా జిల్లా మాథిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోలియాగూడలో నక్సలైట్లు ఈ బీభత్స ఘటనకు పాల్పడ్డారు. భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి వచ్చిన మావోయిస్టులు తొలుత మూడు వాహనాలకు నిప్పటించారు. ఆ తర్వాత అక్కడే ఉండి నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ ను చంపారు.

నిన్న సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో తమ సహచరున్ని పోలీసులు కాల్చి చంపారనే ఆగ్రహంతో నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. స్థానికంగా భీతావహాన్ని కలిగించిన ఘటనా స్థలానికి పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి.

Popular Articles