హైదరాబాద్: తెలంగాణాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన హవాను ప్రదర్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానా్లలో విజయం సాధించింది. తెలంగాణాలో మొత్తం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా, 64 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. విపక్ష బీఆర్ఎస్ పార్టీ 13 మున్సిపాలిటీలను దక్కించుకోగా, 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపాలిటీని ఫార్వార్డ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.
మొత్తం మున్సిపాలిటీల్లో వార్డులవారీగా గెలుపొందిన పార్టీల సంఖ్యను పరిశీలిస్తే.. మొత్తం 2,581 వార్డులకు ఎన్నికలు జరగ్గా, అందులో కాంగ్రెస్ 1,347, బీఆర్ఎస్ 717, బీజేపీ 261, ఇతరులు 256 వార్డుల చొప్పున గెల్చుకున్నారు. కాగా నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ బీ.ేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటన కారణంగా అక్కడ 6వ వార్డుకు ఎన్నిక జరగలేదు.
అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. మొత్తం 414 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా, ఈ వార్తా కథనం రాస్తున్న సమయానికి 372 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ 174, బీఆర్ఎస్ 47, బీజేపీ 68, ఇతరులు 73 డివిజన్ల చొప్పున గెల్చుకున్నారు.
ఇక రాష్ట్రంలోని ఏడు నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగ్గా, నల్లగొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. కరీంనగర్, నిజామాబాద్ లలో బీజేపీ అత్యధిక స్థానాలను గెల్చుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్, సీపీఐ సరిసంఖ్యలో డివిజన్లను గెల్చుకున్నాయి. మహబూబ్ నగర్ లో ఇంకా లెక్కింపు జరుగుతోంది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి.

