Top 5 This Week

Related Posts

కరోనాతో ఎంపీ మృతి

కరోనా మహమ్మారి ఓ పార్లమెంట్ సభ్యుడిని బలి తీసుకుంది. తమిళనాడులోని కన్యాకుమారి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న హెచ్. వసంత కుమార్ కరోనా కారణంగా శుక్రవారం మరణించారు.

తెలంగాణా గవర్నర్ తమిళి సై బంధువు కూడా అయిన వసంత కుమార్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన వసంత కుమార్ పారిశ్రామికవేత్తగానూ దేశవ్యాప్త ప్రాచుర్యం పొందారు.

తమిళనాడులోని వసంత్ టెలివిజన్ ఆయనకు చెందిందే. అంతేగాక వసంత్ అండ్ కంపెనీ పేరుతో చైన్ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తుంటారు. వసంత్ మరణంపట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.

Popular Articles