ఎట్టకేలకు తెలంగాణా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 8వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ సాయంత్రానికి రాజ్ భవన్ నుంచి ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. తెలంగాణా మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి ఛాన్స్ లభించవచ్చని సమచారం. సామాజిక వర్గాల సమీకరణ, శాఖల కేటాయింపు తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

