హైదరాబాద్: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారైంది. తమ పార్టీ అభ్యర్థిగా వి. నవీన్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాత్రి పొద్దుపోయాక అధికారిక ప్రకటన జారీ చేశారు. వచ్చే నెల నవంబర్ 11వ తేదీన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన నవీన్ యాదవ్ 2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు. అనంతర రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ లో చేరి ప్రస్తుత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ను దక్కించుకున్నారు.
