Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

గ్లోబల్ సమ్మిట్ ఇన్విటేషన్: ఏ రాష్ట్రానికి ఏ మంత్రి అంటే..!

హైదరాబాద్: ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే స్వయంగా మన రాష్ట్ర మంత్రులు వెళ్లి వివిధ రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా కలిసి ఈ సదస్సుకు ఆహ్వానిస్తారు. ఎవరెవరు ఏయే రాష్ట్రాలకు వెళ్లాలో సీఎం నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీన మంత్రులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన లేఖలను అందిస్తారు. ఏ మంత్రి ఏ రాష్ట్రానికి వెళతారంటే..

  • జమ్మూ కాశ్మీర్, గుజరాత్: ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • పంజాబ్, హర్యానా: దామోదర రాజనర్సింహ
  • ఆంధ్రప్రదేశ్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • కర్ణాటక, తమిళనాడు: దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  • ఉత్తరప్రదేశ్: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • రాజస్థాన్: పొన్నం ప్రభాకర్
  • ఛత్తీస్ ఘడ్: కొండా సురేఖ
  • వెస్ట్ బెంగాల్: సీతక్క
  • మధ్యప్రదేశ్: తుమ్మల నాగేశ్వరరావు
  • అస్సాం: జూపల్లి కృష్ణా రావు
  • బిహార్: వివేక్ వెంకటస్వామి
  • ఒడిషా: వాకిటి శ్రీహరి
  • హిమాచల్ ప్రదేశ్: అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • మహారాష్ట్ర: మహమ్మద్ అజారుద్దీన్

కాగా ఢిల్లీ సీఎంకు, కేంద్ర మంత్రులకు, గవర్నర్లకు మన రాష్ట్ర ఎంపీలు ఆహ్వాన లేఖలను అందిస్తారని సీఎంవో కార్యాలయం వెల్లడించింది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఈమేరకు బుధవారం ప్రధానితో సీఎం అపాయింట్మెంట్ ఖరారైనట్లు సమాచారం.

Popular Articles