Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

రేపు ఖమ్మానికి సీఎం రేవంత్: ట్రాఫిక్ డైవర్షన్స్ వివరాలివే..

ఖమ్మం: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. అందువల్ల వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను, దారి మళ్లింపును దృష్టిలో ఉంచుకుని పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించడం ద్వారా తమ గమ్యస్థానానికి చేరుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

అదేవిదంగా భారీ వాహనాలు, లారీలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సజావుగా వెళ్లే వరకు హోల్డింగ్ పాయింట్లలో నిలుపుకోవాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ మరింత పెరుగుతున్న దృష్ట్యా నగర ప్రజలు, వాహనదారులు అవసరముంటే తప్ప తమ వాహనాలను రోడ్లపైకి తీసుకురావద్దని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు మార్గాల వివరాలను ఏసీపీ వెల్లడించారు.

ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు:
రాజమండ్రి, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, అశ్వరావుపేట, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు మార్గాల నుంచి హైదరాబాద్ వెళ్లే కార్లు, చిన్నవాహనాలు మాత్రమే వాహనాలు కల్లూరు, వైరా మండలం సోమవరం గ్రామం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కాలన్నారు. అక్కడి నుంచి కొదుమూరు వద్ద హైవే దిగి అల్లీపురం మీదుగా బోనకల్ రోడ్డుకు చేరుకుని ధంసలాపురం బ్రిడ్జి దగ్గర నుండి మళ్లీ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుంది.

హైదరాబాద్ నుంచి కొత్తగూడెం, భద్రాచలం వైపు వెళ్లే వాహనాలు:
హైదరాబాద్ నుండి కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, అశ్వరావుపేట, -రాజమండ్రి వైపు వెళ్లే వాహనాలు పొన్నెకల్లు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే మీదుగా వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద హైవే దిగి (కార్లు,చిన్న వాహనాలు మాత్రమే) ప్రకాష్ నగర్, చర్చి కాంపౌండ్, ముస్తఫా నగర్, అల్లిపురం మీదుగా కొదుమూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే బిడ్జి కింద నుండి వందనం మీదుగా కొత్త కలెక్టరేట్ సమీపంలోని వైరా రోడ్డు చేరుకొని భద్రాచలం, రాజమండ్రి వైపు వెళ్ళవలసి ఉంటుంది.

సత్తుపల్లి / అశ్వరావుపేట నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు:
సత్తుపల్లి – అశ్వరావుపేట మార్గం నుంచి వరంగల్ వైపునకు వెళ్లే వాహనాలు ఖమ్మం కలెక్టరేట్ దాటిన తర్వాత ఎస్ఆర్ గార్డెన్ నుంచి రఘునాథపాలెం ఆపిల్ సెంటర్ మీదుగా లింగాల చేరుకుని, డోర్నకల్ మహబూబాద్ మీదుగా వరంగల్ వెళ్ళవలసి ఉంటుంది.

ఇల్లెందు నుంచి ఖమ్మం వైపు వెళ్లే వాహనాలు:
ఇల్లందు నుంచి ఖమ్మం వైసే వచ్చే వాహనాలు రఘునాధపాలెం ఆపిల్ సెంటర్ నుండి ఎస్సార్ గార్డెన్ వచ్చి, గోపాలపురం, గొల్లగూడెం మీదుగా లకారం చేరుకుని నగరంలోలోకి వెళ్లవలసి ఉంటుంది.

వరంగల్ నుంచి ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం వైపు వెళ్లే వాహనాలు:
వరంగల్ మార్గం నుంచి సత్తుపల్లి, రాజమండ్రి, కొత్తగూడెం మార్గాలవైపు, ఖమ్మం నగరంలోకి వచ్చే (కార్లు, చిన్న వాహనాలు మాత్రమే) ఏదులాపురం ఎక్స్ రోడ్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్ మీదుగా నాయుడుపేట చేరుకుని, అక్కడి నుండి గాంధీ చౌక్ మీదుగా చర్చి కాంపౌండ్ ముస్తఫానగర్, అల్లీపురం కొదుమూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే బిడ్జి కింద నుండి వందనం మీదుగా కొత్త కలెక్టరేట్ సమీపంలోని వైరా రోడ్డు మార్గానికి వెళ్లవలసి ఉంటుంది.

Popular Articles