రైతు బంధు నిధుల విడుదలపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసే బాధ్యత తమదేనని చెప్పారు. ఈ విషయంలో మారీచుల రూపంలో వచ్చే బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మవద్దని రేవంత్ రెడ్డి రైతులను కోరారు. రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తామని కూడా సీఎం మీడియా సమావేశంలో ప్రకటించారు.