Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

గాంధీ భవన్, కొత్తగూడెం, ఢిల్లీ: ఇదీ ఈరోజు సీఎం షెడ్యూల్

హైదరాబాద్: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం బిజీ షెడ్యూల్ లో ఉన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అర్జెంటీనా ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీతో ఫుట్ బాల్ ఆడేందుకు ఉదయాన్నే సీఎం రేవంత్ ప్రాక్టీస్ చేస్తన్నారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలనే వ్యూహాత్మక ఆలోచనతో తాను క్రీడా మైదానంలోకి స్వయంగా దిగినట్లు సీఎం రేవంత్ తన ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించారు. ఫుట్ బాల్ ప్రాక్టీస్ కు సంబంధించిన ఫొటోలను, వీడియోను కూడా ఆయన ఈ పోస్ట్ లో షేర్ చేశారు.

ఇక మంగళవారంనాటి సీఎం పర్యటన షెడ్యూల్ లోకి వెడితే ఉదయం 11 గంటలకు గాంధీ భవన్‌లో టీపీసీసీ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.15 గంటలకు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్శిటీని ప్రారంభిస్తారు. అనంతరం 2.45 గంటలకు కొత్తగూడెం ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

ఆ తర్వాత రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం ఉదయం ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను కలుసుకుంటారు. ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు హాజరు కావలసిందిగా కోరనున్నారు. ఇదే సందర్భంలో పలువురు కేంద్ర మంత్రులను కూడా కార్యక్రమానికి సీఎం రేవంత్ ఆహ్వానించనున్నారు.

Popular Articles