కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి బెదిరిస్తే బెదిరేవారెవరూ లేరని మరోసారి సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం. రెండు రోజుల క్రితమే ‘బెదిరిస్తున్నావా’ అంటూ కిషన్ రెడ్డిని ఉద్ధేశించి కామెంట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మరోసారి అదే పదాన్ని తిరిగి ఉటంకించడం గమనార్హం. కిషన్ రెడ్డి బెదిరిస్తే తెలంగాణాకు అవసరమైన రైలు, రీజనల్ రింగు రోడ్డు, మూసీ ప్రక్షాళన వంటి కీలక ప్రాజెక్టులు రావని సీఎం అన్నారు. వనపర్తిలో నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘నీ దగ్గర మోదీ, ఈడీ, సీబీఐ ఉండొచ్చు.. ఎంతకాలం భయపడ్తమయా.. చావు మల్ల మల్ల రాదు కిషన్ రెడ్డీ గుర్తు పెట్టుకో.. చావు ఒక్కటేసారి ఒస్తది.. చావుకు తెగించే పదేండ్లు కొట్లాడినం’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సమస్య ప్రధాని మోదీ కాదని, తెలంగాణాపట్ల మోదీ సానుభూతితోనే ఉన్నారని, కానీ కిషన్ రెడ్డి సైంధవునిలా అడ్డుపడుతున్నారని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. వనపర్తి సభలో కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సీఎం చేసిన పూర్తి ప్రసంగాన్ని దిగువన గల వీడియోలో చూడవచ్చు..