Top 5 This Week

Related Posts

కేరళకు సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లారు. వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రియాంకా గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ప్రియాంకా గాంధీ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్ది సేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి కేరళకు బయలుదేరి వెళ్లారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచేగాక, ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలి నుంచి కూడా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే వయనాడ్ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాహుల్ రాజీనామాతో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ పోటీ చేస్తున్నారు. బుధవారం ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీతోపాటు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లారు.

Popular Articles